![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -45 లో.. రామలక్ష్మి అభి ఇద్దరు మాణిక్యం దగ్గరగా వస్తారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు.. నాతో రామలక్ష్మికి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా చేంజ్ అయ్యారని అభి అడుగుతాడు. మీరేం చేసినా నా నిర్ణయం మారదని మాణిక్యం అంటాడు. నీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చెయ్యడం కరెక్ట్ కాదని రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత అభి నన్ను పెళ్లి చేసుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అని రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. నువ్వు నేను చెప్పింది వినకుండా నా మాటకి విలువ ఇవ్వనప్పుడు ఇక నేను ఉండి ఎందుకని మాణిక్యం కోపంగా గదిలోకి వెళ్ళి గడి పెట్టుకొని లోపల ఉరి వేసుకుంటున్నట్లు నటిస్తాడు. రామలక్ష్మి వాళ్ళు నిజంగానే ఏదైనా చేసుకుంటున్నాడేమో అనుకోని తలుపు పగులగొట్టి లోపలికి వస్తారు.. మాణిక్యాన్ని ఆపుతారు. ఇప్పుడు అంటే ఆపావ్ కానీ నువ్వు వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎవరు ఆపుతారని మాణిక్యం బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరొకవైపు రామలక్ష్మిపై నెగెటివ్ పోయి సీతాకాంత్ పెళ్లి చేసుకోవాలని పెద్దాయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ధన ఫ్రెండ్ ని పిలిపించి వాళ్ల ఫ్యామిలీ ఎలాంటిదో సీతాకాంత్ ముందు పెద్దాయన చెప్పమని చెప్తాడు. అప్పుడు ధన ఫ్రెండ్ రామలక్ష్మి గురించి అసలు ధన ప్రేమ విషయం తనకి తెలియదు.. మీరు తన గురించి బ్యాడ్ గా అనుకుంటున్నారని చాలా ఫీల్ అయిందని అతను చెప్తాడు.
ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి సిరి వచ్చి.. రామలక్ష్మిని నువ్వు మోసగాత్తే అనడం కరెక్ట్ కాదు. అసలు ధనని చుడడానికి హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ధనని మర్చిపోమని నన్ను రిక్వెస్ట్ చేసింది. మీ అన్నయ్య మంచివాడు వాళ్లకి చెడ్డపేరు తీసుకొని రాకని చెప్పిందని సిరి చెప్పగానే సీతాకాంత్ ఆశ్చర్యంగా అవునా అని అంటాడు. మరొకవైపు మీ నాన్న ఇలా మారిపోయారేంటి.. ఇప్పుడు మనకి వేరే దారి లేదు.. చెప్పకుండా పెళ్లి చేసుకోవడమేనని అభి అనగానే.. మోసం చేసి చేసుకోలేనుమని రామలక్ష్మి అంటుంది. అయితే మన గురించి సీతాకాంత్ సర్ కి చెప్పు అని అనగానే.. సర్ ఏం అంటారో అని అభి అంటాడు. మన గురించి చెప్పడానికి కాకున్నా నేను సర్ విషయంలో కొన్ని తప్పులు చేశాను వాటికి సారీ చెప్పాలని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |